అనసూయ భరద్వాజ్ తెలుగులో యాంకర్, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది అనసూయ. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే ఆమె ప్రస్తుతం ‘థాంక్యూ.. బ్రదర్’ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగ మార్తాండ, రవితేజ ఖిలాడీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం అనసూయ తమిళంలో తన మొదటి సినిమాకు ఓకే చెప్పిందట. అయితే తమిళంలో తన మొదటి సినిమా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న సినిమాగా తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి అను ఓ ఫొటోను షేర్ చేసింది. దానితోపాటు మరో మంచి కథతో కొత్త ప్రయాణం అంటూ రాసుకొచ్చింది. దీనికి నటి సిల్క్ స్మిత రిఫరెన్స్ అని తెలిపింది. ఈ సినిమాలో అనసూయా సిల్క్ స్మిత పాత్ర చేస్తుందని, అందుకే అలా ఇండైరెక్ట్‌గా చెప్పిందని ఆమె అభిమానులు అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
View this post on Instagram