యాంకర్ అనసూయ.. తెలుగు టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ వెండి తెరపై కూడ దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ కొత్త కొత్త ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే నిన్న అనసూయ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లైవ్ లో మాట్లాడింది. ఈ నేపథ్యంలో అందురు అనసూయకు శుభాకాంక్షలు చెప్పాగా.. కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టారు.
ఇంట్లో తనకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుంది. ఈ సందర్భంగా ఓ తుంటరి మాట్లాడుతూ.. ‘ నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి ఆ డ్రస్ ఏంటి..? కొంచం పద్దతిగా ఉండొచ్చుకదా !’ అన్నాడు అంతే అనసూయకు కోపం కట్టలు తెంచుకుంది. ‘నువ్వు ఎవడివిరా నా డ్రస్ గురించి మాట్లాడటానికి.. అమ్మ అయితే ఆ డ్రస్ వేసుకోవాలి ఈ డ్రస్ వేసుకోకూడదు అనే రూల్ ఉంది. అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా. అంటూ మండిపడింది. నా పుట్టిన రోజున నాతో తిట్లు తినాలనుకున్నావా అంది. అమ్మ ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవడివిరా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.