టీవీ రంగంలో టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. ఇక సినిమాల్లో కూడా నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అనసూయ. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న ఒక చిత్రంలో హీరో తల్లి పాత్రకు గాను అనసూయను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. మొదట ఆ పాత్రను ఇంద్రజతో చేయించాలని మేకర్స్ భావించారు. అయితే ఇంద్రజ ఇప్పట్లో హైదరాబాద్ రాలేను అంటూ చెప్పడంతో వారు అనసూయను సంప్రదించారట. హీరోలకు అమ్మ పాత్రలో ఇప్పటి వరకు అనసూయ చేయలేదు. కాని పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా సుమంత్ కు అమ్మగా నటించేందుకు ఒప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. 35 ఏళ్ల వయసులో అనసూయ హీరో తల్లి పాత్రలకు ఒప్పుకోవడం అంటే సాహసమే అని.. అంతటి సాహస నిర్ణయాన్ని అనసూయ తీసుకుంటుంది అంటే నమ్మలేక పోతున్నాం అని.. ఇవన్ని పుకార్లే కావచ్చు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.