HomeTelugu Trendingఅనన్య లవ్‌ ఫెయిల్యూర్‌ నుంచి ఎలా బయటపడిందో తెలుసా!

అనన్య లవ్‌ ఫెయిల్యూర్‌ నుంచి ఎలా బయటపడిందో తెలుసా!

Ananya Pandey talks about h

బాలీవుడ్‌ నటుడు చంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనన్య పాండే. ఆతరువాత ఈ అమ్మడు నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఖో గయే హమ్‌ కహా’ గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. యూత్‌ని ఆకర్షించేలా సిద్ధమైన ఈ కథలో అనన్య.. ప్రేమలో మోసపోయిన అమ్మాయిగా కనిపించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

‘ఖో గయే హమ్‌ కహా’ సినిమా సక్సెస్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన లవ్‌ ఫెయిల్యూర్‌ గురించి మాట్లాడింది. హార్ట్‌బ్రేక్‌ నుంచి బయటపడటం కోసం తాను ఏం చేసిందో చెప్పింది. ”నాకూ హార్ట్‌బ్రేక్స్‌ ఉన్నాయి. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.

దానిని అలాగే వదిలేస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. ఆ టైమ్‌లో ఐస్‌క్రీమ్స్‌ తింటూ, అర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌, ‘ఆషికి 2’ పాటలు వింటూ.. సమయాన్ని గడిపేదాన్ని. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ చూస్తే మనసు తేలికగా అనిపిస్తుంది” అని అనన్య తెలిపింది.

.

Recent Articles English

Gallery

Recent Articles Telugu