పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న నటి అనన్య పాండ్య. మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్స్ కూడా అధికంగానే ఉన్నారు. తన గ్లామర్‌తో ఎంతో మంది కుర్రకారుల గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఓ నైట్ క్లబ్లో మాత్రం ఎంట్రీ లభించలేదు. గత వారం అనన్య తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు ముంబైలోని ఓ నైట్ క్లబ్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. క్లబ్‌లోకి వెళ్తుంటే సిబ్బంది అడ్డుకొని బయటకు పంపించారు. కారణం ఏమిటంటే అనన్య వయసు 24 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం. ఆ క్లబ్లో 24 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి ఉందని, ఆ కారణంతోనే అనన్యను అనుమతి ఇవ్వలేదని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. కాగా తన వయసు వల్లే క్లబ్‌లోకి వెళ్లలేకపోయానని అనన్య తెగ ఫీల్ అవుతుందట.