HomeTelugu Newsఆనంద్ నందా పుట్టిన‌రోజు వేడుక‌ల్లో సెల‌బ్రిటీస్‌!

ఆనంద్ నందా పుట్టిన‌రోజు వేడుక‌ల్లో సెల‌బ్రిటీస్‌!

‘రాణిగారి బంగ్లా’ ఫేం ఆనంద్ నందా పుట్టిన‌రోజు వేడుక‌లు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు పాల్గొని హీరో ఆనంద్ నందాకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌వ‌త‌రం క‌థానాయ‌కుడు ఆనంద్ నందా కెరీర్లో మ‌రిన్ని మంచి అవ‌కాశాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ వేడుక‌ల్లో టాలీవుడ్‌కి చ‌క్క‌ని బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అందించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. `మ‌నం` ఫేం విక్ర‌మ్.కె.కుమార్, `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` ఫేం విజ‌య్‌కుమార్ కొండా స‌హా ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `పెళ్లి చూపులు` నిర్మాత రాజ్ కందుకూరి ఈ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొని ఆనంద్‌నందాకి శుభాకాంక్ష‌లు తెలిపారు. అజ‌య్‌నాయుడు, ప్ర‌భ త‌దిత‌రులు ఈ వేడుక‌ల్లో పాల్గొని బ‌ర్త్‌డే బోయ్‌కి విషెస్ అందించారు. 
 
ఆనంద్ నందా మాట్లాడుతూ .. ”రాణిగారి బంగ్లా చ‌క్క‌ని హార‌ర్ థ్రిల్ల‌ర్‌. ఈ చిత్రంలో క‌థే థ్రిల్లింగ్‌. కాటికాప‌రి కొడుకు శ్మ‌శానంలో దెయ్యంతో ప్రేమ‌లో ప‌డితే, తాను దెయ్యంతో ప్రేమ‌లో ఉన్నాన‌ని విశ్రాంతి వ‌ర‌కూ తెలియ‌క‌పోతే.. అటుపై దెయ్యం అని తెలిశాక .. అది అత‌డి స‌మ‌స్య‌ల్ని సాల్వ్ చేసేందుకు సాయ‌ప‌డితే.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్‌తో వ‌చ్చిన ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చింది. కెరీర్ ప‌రంగా చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నా”న‌ని తెలిపారు. పుట్టిన‌రోజు వేడుక‌లకు విచ్చేసిన ప్ర‌ముఖులు, మిత్రులంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు..తెలిపారు
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu