HomeTelugu Trendingవిజయ్‌ దేవర కొండ బ్రదర్ రెండో సినిమా

విజయ్‌ దేవర కొండ బ్రదర్ రెండో సినిమా

8 8

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ గతేడాది `దొర‌సాని` చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతోనే రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయమయింది. తొలి చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయినా నటనాపరంగా ఆనంద్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో త‌దుప‌రి చిత్రాన్ని మ‌రింత కొత్త‌గా వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని నిర్మాత వెనిగళ్ల ఆనందప్రసాద్ తెలిపారు. కరోనా కారణంగా విడుదల వాయిదా వేశామని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. కథకు ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఆనంద్ దేవ‌ర‌కొండ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని, ఈ చిత్రానికి అగస్తీ మంచి పాటలు అందించారని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu