HomeTelugu Big StoriesAmy Jackson: కొత్త ప్రియుడితో అమీ జాక్సన్‌ ఎంగేజ్మెంట్‌

Amy Jackson: కొత్త ప్రియుడితో అమీ జాక్సన్‌ ఎంగేజ్మెంట్‌

Amy Jackson engagement phot

Amy Jackson: బాలీవుడ్‌ బ్యూటీ అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఎవడు, రోబో 2.O సినిమాలతో ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్ముడు పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయింది. ప్రియుడు, హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ తో అమీ జాక్సన్‌ ఎంగేజ్మెంట్‌ జరిగింది.

అమీ జాక్సన్‌ గతంలో జార్జ్‌ పనయోట్టు అనే బిజినెస్‌మెన్‌తో డేటింగ్‌ చేసింది. అతడితో 2019లో ఎంగేజ్మెంట్‌ కూడా చేసుకుంది. అనంతరం పెళ్లి కాకుండానే తల్లైంది. అయితే వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే వీరి బంధానికి ముగింపు పడింది. 2022లో పనయోట్టుతో తన బంధం ముగిసినట్లు అమీజాక్సన్‌ ప్రకటించింది. అప్పటి నుంచి కుమారుడు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటున్న అమీ జాక్సన్‌.

Amy Jackson engagement1

ఆ తరువాత హాలీవుడ్‌ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఇప్పుడు అతడితో ఎంగేజ్మెంట్‌ చేసుకుంది. స్విట్జర్లాండ్‌లో అందమైన ప్రదేశంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అమీజాక్సన్‌కు రింగ్‌ తొడిగి వెస్ట్‌విక్‌ ప్రొపోజ్‌ చేశాడు. అమీజాక్సన్‌ సైతం వెస్ట్‌విక్‌ ప్రొపోజల్‌కు ఓకే చెప్పేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు అమీ జాక్సన్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు అమీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu