వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘మర్డర్’. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అమృత సినిమా విడుదలను నిలిపివేయాలి అని, చిత్ర ప్రచారాన్ని వెంటనే ఆపమని కోరుతూ అమృత నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నల్గొండ హైకోర్టు ఈ సినిమా విడుదలపై ఉన్న స్టేను తొలిగించింది.
ఇక ఈ గురువారం విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రివ్యూను రామ్ గోపాల్ వర్మ మంగళవారం కొంత మంది పాత్రికేయులకు ప్రదర్శించారు. ఐతే.. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కింది. ఈ సందర్భంగా ప్రణయ్ భార్య అమృత మాట్లాడుతూ.. వర్మ.. తన జీవితాన్ని సినిమాగా తీసి కోర్టును తప్పుదొవ పట్టించారని కోర్టుకు విన్నవించింది. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించాలంటూ హైకోర్టును కోరింది. అయితే.. అమృత లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందకు కోర్టు నిరాకరించింది. దీంతో ఈ గురువారం ‘మర్డర్’ సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. దీంతో నిర్మాతలు ఈ గురువారం ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.