ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు ధర్నా చేపట్టారు.అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు.మద్దతు ప్రకటించకపోతే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరించారు.విద్యార్థుల ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.