HomeTelugu Big Storiesచిరు సినిమాలో అమితాబ్ కాకపోతే మరెవరో..?

చిరు సినిమాలో అమితాబ్ కాకపోతే మరెవరో..?

చిరంజీవి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించబోతున్నాడంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పట్ల చిత్రబృందం నుండి ఎలాంటి స్పందన లేదు. అమితాబ్ నటిస్తాడో.. లేదో.. కానీ ఆయన లెవెల్ కు తగ్గ పాత్ర అయితే కథలో ఉందని తెలుస్తోంది. ఉయ్యాలవాడ గురువుకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో వస్తాయట. కథలో వాటికి చాలా ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. ఆ పాత్ర కోసమే బిగ్ బీ ను అనుకున్నారట. ఆయన కాకపోయినా.. ఆ స్థాయి హీరోని ఈ పాత్ర కోసం రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే అమితాబ్ నటిస్తే సినిమా పరిధి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
మరోపక్క సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ ను అనుకుంటున్నారనే కూడా ప్రచారం జరుగుతుంది. అతి కొద్ది కాల్షీట్స్ కోసం ఆమెకు ఆరు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. ఒకవేళ అమితాబ్, ఐశ్వర్యాలు గనుక ఈ ప్రాజెక్ట్ లో చేరితే దక్షిణాదిన బిగ్ బీ, ఐశ్వర్యా కలిసి నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. పైగా బాలీవుడ్ లో కూడా ఈ క్రేజీ కాంబినేషన్ ఖచ్చితంగా అంచనాలను సృష్టిస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu