బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ .. బ్రహ్మాస్త్ర సినిమాలో షూటింగ్లో భాగంగామనాలీకి వెళ్లారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న బ్రహ్మాస్త్ర చిత్రంలో అమితాబ్, రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, అక్కినేనినాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనాలీ అంటే చలికి పెట్టింది పేరు. చలికాలం వచ్చిందంటే చాలు గజ గజ వణుకుతు నిండుగా రగ్గు కప్పుకొని ఇంట్లో నుంచి బయటకు కదలం. కానీ 77 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ గడ్డ కట్టుకుపోయే చలిలో ఆ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా షూటింగ్ సెట్ లో తాను దిగిన ఫోటోను అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో రణ్‌బీర్ కపూర్ కూడా కనిపిస్తున్నారు. గడ్డకట్టే చలిలో షెడ్యూల్ జరుగుతోంది. పని కొనసాగుతూనే ఉంది. మనముందున్న బాధ్యతను ఇచ్చిన సమయంలో, ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయడం సినిమా నిర్మాణంలో ఎప్పటికీ ఓ సవాలే అని తన బ్లాగ్
లో అమితాబ్ పేర్కొన్నారు. ఆయనకు వృత్తి పట్ల ఉన్న డెడికేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.