బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. లాక్‌డౌన్ తర్వాత అమితాబ్ రెగ్యులర్ గా అభిమానులతో టచ్‌లోఉన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తునే ఉన్నారు. ఆయన నటించిన ‘మహాన్’ అనే సినిమా ఈ రోజుతో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆ సినిమాకి సంబంధించిన ఫొటోను షేర్ చేసారు బిగ్ బి. ఈ ఫొటో చుసిన ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. దానికి కారణం ఈ ఫొటోలో అమితాజ్ అండర్ వేర్ తో ఉన్నారు. అంతే కాదు దీనితో పాటు ఓ జోక్‌ని సైతం ఆయన జోడించారు.
‘ఇప్పటి జనరేషన్ వాళ్ళలో సోషల్ మీడియాలో చాలా మందికి ఎక్కువగా ఫాలోవర్లు ఉంటున్నప్పుడు నీకు ఎందుకు ఉండటం లేదు? బహుశా నువ్వు ఇన్నర్ దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయకపోవడమే కారణమంటూ కొంతమంది నాతో అన్నారు. అప్పుడే ఈ ఫొటోను నేను పోస్ట్ చేశా. త్రిపాత్రాభినయం చేసిన ‘మహాన్’ సినిమా విడుదలై నేటికి 37 ఏళ్లయింది’ అని అమితాబ్ తెలిపారు .