బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన పోస్టులతో అభిమానులకు మంచి సందేశాలిస్తుంటారు. తాజాగా ఆయన యువతనుద్దేశించి ఓ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘ఉదయం లేవగానే నిన్ను నువ్వే ఎదుర్కోవాలి. చిన్నతనంలో ఉన్నప్పుడు నీకు మొత్తం ప్రపంచాన్ని సంతోషపెట్టాలని అనిపిస్తుంది కదా.. కానీ, నీకు ఆనందం కలిగించేదే చేయాలి. నీ కోసం నువ్వు జీవించాలనుకునే జీవితాన్ని సృష్టించుకో. అప్పుడు తప్పకుండా నువ్వు నిజంగా ఇష్టపడే వ్యక్తిని నీలో నువ్వు చూస్తావు’ అని తెలిపారు. అంతేకాకుండా ఓ ఫొటోను జతచేశారు. అందులో ‘కొన్ని సమయాల్లో వెనక్కి తిరిగి చూడటం, ఆలోచించటం చాలా అవసరం’ అనే వాక్యం జోడించారు. ప్రస్తుతం ఆయన అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్బీర్ కపూర్, మౌనీ రాయ్, అలియా భట్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటించనున్నారు. అదే విధంగా ప్రభాస్, దీపికా పదుకొణెతో కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు.
T 3755 – The only person you have to face in the morning is yourself. When you’re younger, it feels like you have to please the entire world. You don’t.
Do what makes you happy, create the life you want to live for yourself. You’ll see someone you truly love staring back at you.— Amitabh Bachchan (@SrBachchan) December 17, 2020
View this post on Instagram