Kalki Pre-release Event: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కల్కి. భారీ అంచనాల మధ్య అన్నీ భారతీయ భాషల్లో ఈ సినిమా ఈ నెల 27 వ తేదీన విడుదల కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
ఇప్పటికే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ కూడా బాగానే క్లిక్ అయింది. ఇక సినిమా ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.
Kalki 2898 AD details:
ప్రభాస్, నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ఈవెంట్లో పాల్గొన్నారు. సినిమా గురించి బోలెడు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ వేడుకలో మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
“నాగ్ అశ్విన్ నా దగ్గరికి వచ్చి కథను చెప్పినప్పుడు అసలు తను ఈ కథని ఏం తాగి రాసి ఉంటాడు అని అనిపించింది. అంత ఫ్యూచరిస్టిక్ గా ఈ కథ ఉంది. ఇంత అద్భుతమైన కథని తను ఎలా రాసుకోగలిగాడు అనిపించింది. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ తోనే మీకు అర్థమవుతుంది. సినిమా షూటింగ్ లోనే మాకు అర్థం అయింది. మేము చిత్రీకరించిన ప్రతి సీన్, ప్రతి విజువల్ నాగ్ అశ్విన్ మైండ్ నుండి పుట్టినవి. ఈ సినిమా లో ఒక చిన్న భాగం కావడమే నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి అనుభవం” అంటూ నాగ్ అశ్విన్ పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రభాస్ కి ఎంతో మంచి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటి ఈ వేడుకలో హోస్ట్ గా వ్యవహరిస్తూ అందరినీ అలరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
More About Kalki:
దీపిక పడుకొనే ఈ సినిమాకి హీరోయిన్ గా నటిస్తోంది. పలు భాషల నుండి స్టార్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో అలాగే క్యామియో పాత్రలలో కనిపించనున్నారు. దిశా పఠాని, బ్రహ్మానందం, కమల్ హాసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.