HomeTelugu Big Storiesఆసుపత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌!

ఆసుపత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌!

amitabh bachchan hospitalized
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(81) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ఆయన కాలులోని గడ్డ ఏర్పడడంతో యాంజియోప్లాస్టీ సర్జరీ చేసినట్లుగా సమాచారం. ఆయన ఆరోగ్యానికి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నివేదికల ప్రకారం ఆయనకు శుక్రవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

బిగ్ బీ ఆరోగ్యంపై ఆయన కుటుంబం గానీ.. వైద్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అమితాబ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బిగ్ బీ గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లకముందు తన సోషల్ మీడియా ఖాతాలో కల్కి ప్రాజెక్టు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు బిగ్ బీ.

దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికీ వరుసగా సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటున్నారు. ఇటీవల కల్కి సినిమా గురించి అభిమానులతో కొన్ని విషయాలను పంచుకున్నారు బచ్చన్. కల్కి ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అన్ని పనులు పూర్తవుతాయని.. అనుకున్నట్లే మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో కల్కి సినిమా విడుదల తేదీపై వచ్చిన రూమర్స్ అన్నింటికి చెక్ పడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu