బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్ నందా కుమారుడు అగస్త్య నందా ఓ సినిమాలో హీరోగా కనపడనున్నట్లు సమాచారం. అగస్త్యకు బాల్యం నుంచే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉండేది.
బాలీవుడ్ ఎంట్రీకి ముందే తాత అమితాబ్, తల్లి శ్వేతాతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఎత్తుకు తగిన అందం, వర్ణంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే టాలెంట్ అగస్త్యలో ఉందనే మాట వినిపిస్తున్నది. ఆయన ప్రస్తుతం సినిమా కథలు వింటున్నాడని తెలుస్తోంది. తనకు నచ్చిన కథతో హీరోగా బాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మరోవైపు, అగస్త్య సోదరి నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణిస్తోంది. అమితాబ్ కుటుంబంలో దాదాపు అందరూ సినీనటులే.