కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భేటీ కానున్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 16నే హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దివంగత సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారు. 17వ తేదీ ఉదయం విమోచన వజ్రోత్సవాలకు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ప్రభాస్ తో ఆయన భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.