నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి తదితరులు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
మ్యూజిక్: మణిశర్మ
ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు
రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘అమీతుమీ’. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
జనార్ధన్(తనికెళ్ళభరణి)కు ఇద్దరు పిల్లలు. దీపిక(ఈషా), విజయ్(అవసరాల శ్రీనివాస్). దీపిక.. అనంత్(అడివి శేష్) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. విజయ్ తన తండ్రి శత్రువు కూతురు మాయ(అదితి)ను ప్రేమిస్తాడు. వీరి ప్రేమకు జనార్ధన్ ఒప్పుకోడు. దీపికాకు శ్రీచిలిపి(వెన్నెల కిషోర్) అనే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరోపక్క మాయ తన తండ్రి అంగీకారంతోనే పెళ్లి జరగాలని మెలిక పెడుతుంది. మరి వీరి ప్రేమకథలు సక్సెస్ అయ్యాయా…? దీపికాను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీచిలిపి సంగతేంటి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
రొటీన్ కథకు కామెడీ జోడించి సినిమా చేయాలనుకున్నాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. దీంతో అతడి సినిమాల్లో కనిపించే కొత్తదనం ఈ సినిమాలో కనిపించదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉన్నప్పటికీ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ మొదలైన తరువాత ప్రేక్షకుడిలో అసలు క్యూరియాసిటీ ఉండదు. రొటీన్ ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మరింత విసుగు తెప్పించాయి. వెన్నెల కిషోర్ తో చేయించిన కామెడీ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. కామెడీ పంచ్ లు కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి.
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈషా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మేకోవర్ బావుంది. అదితి పూర్తిస్థాయిలో హీరోయిన్ పాత్రలో నటించిన మొదటి సినిమా ఇది. ఉన్నంతలో ఓకే అనిపించింది. తనికెళ్ళభరణికి అతడి పాత్ర అసలు సెట్ కాలేదు.
తన నటనలో అతి ప్రదర్శించారు.
టెక్నికల్ ఈ సినిమాను అతి తక్కువ బడ్జెట్ లో చిత్రీకరించారు. కానీ లో బడ్జెట్ లో క్వాలిటీగా సినిమా చేశారు. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. మణిశర్మ సంగీతం ఏవరేజ్ గా ఉంది. ఉన్న రెండు పాటలు అంత గొప్పగా ఏమీలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో.. సో.. గా ఉంది. ఇంద్రగంటి సినిమాల్లో ఆశించే క్లాస్ కామెడీ ఈ సినిమాలో లేకపోయినా.. మాస్ కు కనెక్ట్ అయ్యే
కామెడీ డైలాగ్స్ మాత్రం సినిమాలో ఉన్నాయి.
రేటింగ్: 2/5