HomeTelugu Trending'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఫస్ట్ సింగిల్ ప్రోమో

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

Ambajipeta 1
టాలీవుడ్‌లో కలర్ ఫొటో సినిమాతో సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు సుహాస్. మొదటి సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ కూడా విజయం సాధించింది. తొలి సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న సుహాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.

సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. ఈ మూవీకి దుశ్యంత్ కటికినేని డైరెక్టర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అయింది. వీటితో ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ ప్రోమోను సైతం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్2 తెరకెక్కిస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu