Amaran Movie Review:
శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన Amaran సినిమా ఇండియన్ ఆర్మీలో పని చేసిన మేజర్ ముకుందన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాను ఎంతో భావోద్వేగంతో మలిచారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ మేజర్ ముకుందన్ జీవితంలోని భావోద్వేగాల్ని ఈ సినిమా ఎలా చూపించిందో చూద్దామా?
కథ:
ఈ సినిమా కథ సాయి పల్లవి పాత్ర ఇందు ద్వారా మేజర్ ముకుందన్ కథని పరిచయం చేస్తుంది. మేజర్ ముకుందన్ (శివ కార్తికేయన్) సైన్యంలో ఎలాంటి ఘనతలు సాధించాడు, ఇందు అతనితో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, అతని వదిలి వెళ్లిన తర్వాత ఆమె అనుభవించే కష్టాలను ఈ సినిమా చూపిస్తుంది. మేజర్ ముకుందన్ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ఈ కథలోని ప్రధానాంశం.
నటీనటులు:
శివ కార్తికేయన్, మేజర్ ముకుందన్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ కి ఈ పాత్ర చాలా బాగా సెట్ అయ్యింది. కానీ, సాయి పల్లవి ఈ సినిమాలో అసలైన హైలైట్ అని చెప్పచ్చు. ఆమె ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. ముఖ్యంగా, భర్త మరణించిన సందర్భంలో సాయి పల్లవి చూపించే భావోద్వేగాలు సినిమాకు హార్ట్ అని చెప్పొచ్చు. రాహుల్ బోస్ వంటి ఇతర పాత్రధారులు కూడా తమ పాత్రలను బాగా న్యాయం చేసారు.
సాంకేతిక అంశాలు:
కశ్మీర్ లోయల్లో ఉగ్రవాద కార్యకలాపాలను చూపించడంలో కెమెరామేన్ సాయ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించారు. జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సన్నివేశాలకు గుండెను పిండేలా ఉంటుంది. మొదటి హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లో గా అనిపించవచ్చు. ఎడిటింగ్‌లో కొద్దిగా మెరుగుదల అవసరం ఉంది, ముఖ్యంగా మొదటి హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త పొడవుగా అనిపిస్తాయి.
పాజిటివ్ పాయింట్స్:
*సాయి పల్లవి
*శివ కార్తికేయన్
*నేరేషన్
నెగెటివ్ పాయింట్స్:
*కథలో కొత్తదనం లేకుండా రెగ్యులర్ ఆర్మీ కథలగా ఉండడం
*ఉగ్రవాద చర్యలు, నాయకులకు సంబంధించిన కథలు అంత లోతుగా ఉండకపోవడం
*ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
తీర్పు:
మొత్తానికి, అమరన్ ఒక భావోద్వేగపూర్వక యాక్షన్ డ్రామా. సాయి పల్లవి అద్భుతమైన నటన సినిమాను ప్రేక్షకులు ఆద్యంతం కట్టిపడేసేలా చేస్తుంది. కథాపరంగా కొత్తదనం లేకపోయినప్పటికీ, అమరన్ ఈ వీకెండ్ మంచి ఫీల్ ఇచ్చే సినిమాగా నిలుస్తుంది అని చెప్పచ్చు.
రేటింగ్: 3.25/5