నటి అమలాపాల్ టాప్ హీరోలతో సినిమాలు చేసినా పాపం పెద్దగా కలిసిరాలేదు. అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమా చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ ఆరువాత ఈ హీరోయిన్ రామ్ చరణ్ తో నాయక్ చేసింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిట్టయినా.. తరువాత సినిమాలు చేయలేకపోయింది అమలా. కాగా, పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం తరువాత విడిపోయింది. ఇటీవలే అమలా పాల్ ‘ఆమె’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. బోల్డ్లుక్ తో మెప్పించింది. కాగా, ఈ అమ్మడు ఇప్పుడు విదేశాల్లో విహరిస్తోంది. స్విమ్ సూట్లో ఎత్తైన కొండలు ఎక్కుతూ తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు “నన్ను చంపే ప్రతి క్షణం.. నేను బ్రతికే ఉన్నాను అనే అనుభూతిని ఇస్తోంది” అని ట్యాగ్ చేసింది. ఆ కొండల్లో కాలు జారితే ఇంకేం ఉండదు. ఎందుకింత సాహసం అని కొందరు నెటిజన్లు మెసేజ్ చేస్తున్నారు.
Everything that kills me makes me feel alive! 💫#swimtime #FridayFeeling #AmalaPaul pic.twitter.com/nqX5nlECvT
— Amala Paul ⭐️ (@Amala_ams) September 6, 2019