బోల్డ్ హీరోయిన్ అమలాపాల్ సడెన్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు ముంబయికి చెందిన గాయకుడు భవిందర్ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్న అమలాపాల్ ఇప్పుడు అతడిని పెళ్లాడిందని తెలుస్తుంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఆయన ఇప్పటికే పలుమార్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు కూడా . ఏదిఏమైనా ఇప్పుడు ఈ అమలాపాల్ పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోలు చుసిన కొందరు ప్రపంచమంతా కరోనా తో వణికిపోతుంటే మీరు మాత్రం పెళ్లి అంటూ హంగామా చేస్తున్నారా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండేళ్ల క్రితం అమలాపాల్, డైరెక్టర్ విజయ్ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అమలాపాల్‌ను సినిమాల్లో నటించవద్దని విజయ్ కండీషన్ పెట్టడం ఈవివాహం విడాకులకు దారితీసిందని వినికిడి. ఏమైయిందో కానీ మొత్తనికి విడిపోయారు వీరిద్దరు. ఇప్పుడు అమలాపాల్ సినిమాలతో బిజీగా వుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ మూడు చిత్రాలు వున్నాయి.