రాహుల్ విజయ్ – అమలా పాల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుకున్న సిరీస్ ‘కుడి ఎడమైతే’. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇదేనని చెబుతున్నారు. పవన్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ను ఈ నెల 16వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగుకు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ఒక టీజర్ ను విడుదలైంది. ప్రధానమైన పాత్రలకు సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది.
అమలా పాల్ ఒక పోలీస్ ఆఫీసర్ .. రాహుల్ విజయ్ ఒక డెలివరీ బాయ్. ఈ ఇద్దరూ ఎవరి పనులపై వారు వెళుతూ ఉండగా, యాక్సిడెంట్ జరుగుతుంది. ఇద్దరూ కూడా ఆ ప్రమాదంలో గాయపడతారు. ‘లూసియా యు టర్న్’ (తెలుగు యు టర్న్) ను తెరకెక్కించిన దర్శకుడి నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అందరిలోను ఆసక్తి ఉంది. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ‘కుడి ఎడమైతే’ సిరీస్ నిర్మిస్తుంది.