HomeTelugu Trendingవెంకటేష్‌ సినిమాలో అమలా పాల్‌

వెంకటేష్‌ సినిమాలో అమలా పాల్‌

8
సంచలన నటి అమలా పాల్ భర్త నుంచి విడాకులు తీసుకుని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదనే చెప్పాలి. మెల్లి మెల్లిగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ బ్యూటీకి మంచి ఛాన్స్ దక్కిందని వార్తలు వినిపిస్తోంది. తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న నారప్ప మూవీలో అమలా పాల్ నటించబోతోందని టాక్‌. అనంతపురం పరిసరాల్లో నారప్ప చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుంది. తాజాగా మరో నటి అమలాపాల్‌ను కూడా తీసుకున్నారట. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu