హీరోయన్ అమలాపాల్ పోలీసులను ఆశ్రయించారు. మాజీ ప్రియుడు పవీందర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. అతనిపై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పవీందర్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. మిగతా 11 మంది కోసం గాలింపు చేపట్టారు.
2018లో అమలాపాల్, పవీందర్ సింగ్ సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఆ టైమ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ లావాదేవీల్లో విబేధాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. తను అడిగినప్పుడు కావలసిన డబ్బు ఇవ్వకపోయినా, తన మాట వినకపోయినా ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించసాగాడు. దాంతో అమలాపాల్ పోలీసులను ఫిర్యాదు చేశారు. నిర్మాణ సంస్థ డైరెక్టర్‌గా అమలాపాల్ పేరును తొలగించి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని.. అతని మిత్రులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అమలాపాల్.