HomeTelugu Trendingనాగార్జునతో కలిసి నటించడం కష్టం: అమల

నాగార్జునతో కలిసి నటించడం కష్టం: అమల

Amala about nagarjunaనటి అమల అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమాలో అమల అమ్మ పాత్రలో నటించి అందరి చేత
కంటితడి పెట్టించింది. ఆమె నటనపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా అమల పాల్గొంటున్నారు. ఈ
క్రమంలో ఆమె ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను సినిమాలకు గ్యాప్‌ ఇవ్వడానికి కారణం,
అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియాను చూసుకోవడమే అని చెప్పింది. ఇక ఈ సినిమా చూశాకా తన తల్లి తనను గట్టిగా హత్తుకుని
చాలా గర్వంగా ఉందని మెచ్చుకున్నారు అని తెలిపారు.

ఏదైన మంచి పాత్రలు వస్తే తప్ప సినిమా చేయను అని చెప్పిన అమలకు నాగార్జునతో అనే ప్రశ్నదురైంది. దీనిపై స్పందించిన
అమల ” ఇంట్లో ఎప్పుడు ఆయనే కనిపిస్తారు… ఇక సినిమాలో కూడా ఆయనతోనే అంటే కష్టం” అంటూ.. నవ్వేసింది. ప్రస్తుతం
ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu