శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల్లూరి’. మలయాళ నటి కయదు లోహర్ టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణు గోపాల్ ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 23న ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ తో స్పష్టమౌతోంది. ఈ సినిమాలో తనికేళ భరణి, రాజా రావింద్ర, సీనియర్ నటుడు సుమన్, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 18న భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.