అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు అల్లు స్నేహ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్లో ఏ హీరో భార్యకు లేనంతగా ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు స్నేహకు 4 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల్లు స్నేహ తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసనకు 3.3 మిలియన్స్, మహేశ్‌బాబు భార్య నమ్రతకు 2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.