HomeTelugu TrendingAllu Sirish: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తాను అని కమిట్ అయిన హీరో

Allu Sirish: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తాను అని కమిట్ అయిన హీరో

Allu Sirish
Allu Sirish promises to bring Allu Ayaan for his next event

Allu Sirish Buddy Trailer: ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ సినిమాలు బాగా తగ్గించేసాడని చెప్పుకోవాలి. ఎప్పుడో 2022లో ఊర్వశివో రాక్షసివో సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న శిరీష్ మళ్లీ ఇన్నాళ్ళకి బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే ఈ సినిమాలో అల్లు శిరీష్ తో పాటు మరొక హీరో కూడా హీరో పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్రలో ఒక పెద్ద టెడ్డీ బేర్ కనిపించబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. రొటీన్ కథలను కాకుండా శిరీష్ ని ఇలాంటి కొత్తదనం ఉండే కథలలో చూడటానికి ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఫ్యాన్స్ కి ఒక ప్రామిస్ చేసేసారు. నెక్స్ట్ ఈవెంట్ కి అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ని తీసుకొస్తారా అని అడిగితే.. అల్లు శిరీష్ వెంటనే కచ్చితంగా తీసుకొస్తానని కమిట్మెంట్ ఇచ్చేసాడు.

“అల్లు అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే జలసిగా ఉంది. సోషల్ మీడియా మొత్తం వాడి హవానే నడుస్తుంది” అని అంటూ నవ్వేసారు అల్లు శిరీష్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అయాన్ ను తనతో పాటు తీసుకువస్తానని చెప్పారు. అల్లు అర్జున్ ని కూడా తీసుకొస్తారా అని అడగగా లేదు అని ఇండైరెక్టుగా చెబుతూ చూద్దాం చూద్దాం అని కవర్ చేసేసారు.

అల్లు అర్జున్ పిల్లలతో అల్లు శిరీష్ కి స్పెషల్ బాండింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అయాన్ ను కచ్చితంగా తీసుకొస్తానని శిరీష్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చేసాడు.

Allu Sirish Buddy Release Date:

సామ్ అంటోన్ దర్శకత్వం వహిస్తున్న బడ్డీ సినిమాలో ప్రిష రాజేష్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. అజ్మల్ అమీర్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ అలి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. కేఈ జ్ఞానవెల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ తమీజ సంగీతాన్ని అందిస్తున్నారు. జూలై 26న బడ్డీ థియేటర్లలో విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu