HomeTelugu Big Storiesఅల్లు శిరీష్‌- అనూ ఇమ్మాన్యుయేల్‌ .. 'Prema కాదంట'!

అల్లు శిరీష్‌- అనూ ఇమ్మాన్యుయేల్‌ .. ‘Prema కాదంట’!

Allu sirish new movie prem

టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్‌ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు శిరీష్‌ ఓ రేంజ్‌లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో తన లుక్‌ను కూడా ఇదివరకే విడుదల చేశారు. ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన ఈ హీరో తన సినిమాకు సంబంధించి వరుస ప్రీ లుక్‌లు రిలీజ్‌ చేస్తూ జనాలను ఆకర్షించాడు.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘Prema కాదంట’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్‌ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu