HomeTelugu Trendingబ్రేకప్‌ పై అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రేకప్‌ పై అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

allu sirish interesting com

టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్.. త్వరలో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ని కలిగించడం ఖాయం అని తనకు మంచి విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాడు అల్లు శిరీష్.

‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన హీరో అల్లు శిరీష్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.

సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన అల్లు శిరీష్ తన లైఫ్ లో వున్న ఆసక్తికర బ్రేకప్ లవ్ స్టోరీని వివరించాడు. తన లైఫ్ లో మూడు క్రేజీ బ్రేకప్ లవ్ స్టోరీస్ వున్నాయని చెప్పిన అల్లు శిరీష్ అందులో ఓ పెద్దింటి అమ్మాయితో ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించి షాకిచ్చాడు. ఒక మంచి పెద్దింటి ఫ్యామిలీకి చెందిన అందమైన అమ్మాయితో డీప్ లవ్ లో వున్నానని అయితే ఎందుకో తెలియదు కానీ కొంత కాలం క్రితం తనకు బ్రేకప్ చెప్పానని వెల్లడించి షాకిచ్చాడు. అంతే కాకుండా అది ఇప్పటికీ తనని బాధిస్తోందని తను అప్పట్లో తనకు బ్రేకప్ చెప్పడం కరెక్టా కాదా? అన్నది ఆలోచిస్తే అప్పట్లో మాత్రమే కరెక్ట్ అని ఇప్పడు మాత్రం కరెక్ట్ కాదనిపిస్తోందని తెలపడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu