HomeTelugu Trendingపెళ్లి వార్తలపై స్పందించిన అల్లు శిరిష్‌

పెళ్లి వార్తలపై స్పందించిన అల్లు శిరిష్‌

Allu sirish clarity on his

టాలీవుడ్‌లో వరుస పెళ్లి జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రీం హీరో సాయితేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. తన కంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి జరుగుతుందని ఆయన చెప్పాడు. దీంతో త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి జరగబోతోందని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. పెళ్లి కూతురు ఎవరంటూ శిరీష్‌ ను అభిమానులు అడుగుతున్నారు.

ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా అల్లు శిరీష్ స్పందించాడు. సాయితేజ్ సరదాగా అలా చెప్పి ఉంటాడని.. అందరూ ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్నారని చెప్పాడు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి తనపై ఒత్తిడి లేదని చెప్పాడు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తానే చెబుతానని తెలిపాడు. ఈ విధంగా తన పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu