Allu Sirish Buddy:
టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ రెండవ తనయుడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. గత పది ఏళ్లుగా సినిమాలలోనే ఉన్నారు కానీ.. అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయారు. వరుసగా డిజాస్టర్లు అందుకున్న అల్లు శిరీష్ ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా పర్వాలేదు అనిపించింది కానీ కమర్షియల్ గా అంత హిట్ అవలేదు. మళ్లీ కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ప్రాణం ఉన్న ఒక టెడ్డీబేర్ మాత్రం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఈనెల 26వ తేదీన థియేటర్లలో విడుదల కావాలి.
తాజాగా ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాని ఆగస్టు రెండవ తేదీన విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఇంత సడన్ గా శిరీష్ సినిమా ఎందుకు వాయిదా పడింది అని ఇప్పుడు చర్చ మొదలైంది.
ఇప్పటికే అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. ఎన్నికల సంబంధించి ఈ మొదలైన ఈ హడావిడి ఇప్పటికీ కూడా చల్లారలేదు. ఈ ప్రభావం పుష్ప 2 మీద కూడా కనిపించే అవకాశం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. దీంతో తమ సినిమా మీద కూడా ఆ ప్రభావం ఉంటుందేమో అన్న భయంతో శిరీష్ తన సినిమాని వాయిదా వేశారా అని కూడా టాక్ వినిపిస్తోంది.
మరోవైపు సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి అంత బజ్ తేలేకపోయింది. ఎంత కష్టపడి సినిమా చేసిన సినిమా ఇంకా అందరి దృష్టిలో పడటం లేదు. బజ్ లేకుండా విడుదల చేసిన కలెక్షన్లు పెద్దగా ఉండవు. అందుకే సినిమాని ఇంకా బాగా ప్రమోట్ చేసి.. విడుదల చేయాలని సినిమా వాయిదా వేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.
సినిమా వారం పాటు వాయిదా వేశారు. మరి ఈ వారంలో సినిమా మీద బజ్ తీసుకురాగలరా వేచి చూడాలి. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రిష సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది.