టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ ప్రీ లుక్ విడుదలైంది. ఈ రొమాంటిక్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. తాజాగా మరో ప్రీలుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయ్యింది. ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం. ‘#SIRISH6’ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు తదితరుల వివరాలు ఫస్ట్ లుక్ ద్వారా మేకర్స్ వెల్లడించనున్నారు.
Here’s our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ
— Allu Sirish (@AlluSirish) May 29, 2021