పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయ్యాడు అల్లు అర్జున్. తాజాగా జాతీయ అవార్డుకు ఎంపికై చరిత్ర సృష్టించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ రెమ్యునరేషన్ గురించి సెన్సేషన్ వార్త ఒకటి బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి ఇతర స్టార్ హీరోలు కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నారని తెలిసింది.
ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అభిమానులు ఊహించిన దాన్ని కన్నా వెయ్యి రెట్టు ఎక్కువగా ఇవ్వాలని శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసమే ఆయన తీసుకోబోయే రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. పుష్ప సినిమా సౌత్ కన్నా నార్త్ లోనే ఎక్కువగా వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే.
పుష్ప 2 కోసం నార్త్ ఆడియెన్సే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఇప్పుడు అక్కడ ఉన్న క్రేజ్ ప్రకారం దాదాపు రూ. 125కోట్లకు అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడా రైట్స్ బన్నీ తీసుకున్నట్లు తెలిసింది. పారితోషికానికి బదులు హిందీ రైట్స్ తీసుకున్నారట. అంటే ఈ లెక్కన.. తెలుగులో రూ. 125కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్.. అల్లు అర్జునే అవ్వడం విశేషం. ఇక దీన్ని అమ్ముకుంటే లాభాలే లాభాలు.
తెలుగులో ఇప్పుటి వరకు ప్రభాసే రూ. 100కోట్లు ఎక్కువ తీసుకున్నారని ప్రచారం సాగింది. ఆ తర్వాత మహేశ్, పవన్ రూ.70 తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు బన్నీ ఏకంగా రూ.125కోట్లు అని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రచారం అవుతున్న ఈ వార్తతో సినీ ప్రియులు, బన్నీ అభిమానులు షాక్ అవుతున్నారు.