స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడటంతో.. హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపాడు. అంతేకాదు తనకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని, అభిమానులు ఎవరు ఆందోళన చెందనక్కర్లేదని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే క్వారంటైన్‌లో ఉన్న బన్నీ తన పిల్లలు చేస్తున్న అల్లరి, తుంటరి పనులను గమనిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు.
ఇటీవల ఇంట్లోను మాస్క్‌తో ఉన్న అర్హ తన తల్లి స్నేహా రెడ్డితో ఆడుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక తాజాగా తన కోసం తన కూతురు అర్హ వేసిన స్పెషల్ దోశ వీడియో షేర్ చేస్తూ.. నాన్నకి అర్హ స్పెషల్ దోశ. గతంలో నేను వేసిన దోశ స్టెప్పుని ఆదర్శంగా తీసుకొని ఇలా వేసిందేమో. నా జీవితంలో మరచిపోలేని దోశె అంటూ వీడియోకి కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.