Pawan Kalyan Birthday:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వివాదం.. చాలా రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కి ముందు మొదలైన ఈ గొడవ.. Pawan Kalyan డిప్యూటీ సీఎం గా పవర్ లోకి వచ్చి ఇన్ని నెలలు గడిచినా కూడా ముదురుతూనే ఉంది తప్ప ఆగడం లేదు.
అయితే తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ఒక ట్వీట్ ద్వారా.. ఈ వివాదానికి శుభం కార్డు పడేలాగా కనిపిస్తోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవల కారణంగా.. మెగా అభిమానులు చాలా కాలంగా అల్లు అర్జున్ ని సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారా లేదా అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఈ పుకార్లన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అల్లు అర్జున్ ఫైనల్ గా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అండ్ డి సి ఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ సింపుల్ గా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అయితే మొన్న ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కానీ అల్లు అర్జున్ మీద అటు ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పేసారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుందో లేదో వేచి చూడాలి.