Allu Arjun wax statue at Dubai: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం సౌత్ ఇండియాలోని ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చసూస్తున్నారు
అల్లు అర్జున్‌కి తెలుగులోనే కాకుండా..తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సౌత్ హీరోలలో అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. అందుకు నిదర్శనంగానే దుబాయ్ లో ఉన్న మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సౌత్ ఇండియా నుంచి ఏర్పాటు చేయబడుతున్న మొట్టమొదటి హీరో విగ్రహం ఇదేనని తెలుస్తోంది. ఇక నిన్న అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ వాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే దానితో కలిసి ఫోటో దిగాడు అల్లు అర్జున్.
ఒక నటుడి జీవితంలో మెల్ స్టోన్ వటింది అని బన్నీ చెప్పుకొచ్చాడు. ‘పుష్ప’ స్టైల్‌లో ఉన్న ఈ స్టాట్యూ అచ్చం బన్నీలానే ఉంది. అల్లు అర్జున్ కూడా విగ్రహం వేసుకున్నట్లే రెడ్ జాకెట్ వేసుకున్నాడు. దీంతో ఆ స్టాట్యూ అల్లు అర్జున్ కూడా ఒకేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO
— Allu Arjun (@alluarjun) March 28, 2024