ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. తొలిరోజే సినిమా మంచి టాక్ రావడంతో చిత్రయూనిట్ కూడా ఫుల్ జోష్‌లో ఉంది. సౌత్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో సైరా రూ. 38 కోట్ల వరకు షేర్ వసూలుచేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 60 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ పెద్దలతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే మెగా కుటుంబంలోని వారంతా సినిమా చూసారు. తాజాగా బన్నీ కూడా సైరా సినిమా చూసాడు. సుదర్శన్ థియేటర్లో మెగా ఫ్యామిలీ అంతా వచ్చి తొలిరోజే సినిమా చూసింది. ఇక ఇప్పుడు బన్నీ కూడా ఏఎంబి సినిమాస్‌లో కుటుంబంతో వచ్చి సైరా సినిమాను చూసాడు. ఆయనతో పాటు భార్య స్నేహారెడ్డి.. కుమారుడు అయాన్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత చిరంజీవి నటనకు ఫిదా అయిపోయి చిత్రయూనిట్ అందరికీ అల్లు అర్జున్ కంగ్రాట్స్ చెప్పాడు.