స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు హైదరాబాద్‌లోని తన నిర్మాణ సంస్థ ‘గీతాఆర్ట్స్’ కార్యాలయం కనిపించాడు. అక్కడ ఎప్పుడూ ఉండే సందడి, హంగామా ఇప్పుడు కనిపించలేదని నిరాశకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. “చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి సందడి లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి” అని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆఫీసు ప్రాంగణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు బన్నీ. అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.” దీని పై అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు దాటేసిన విషయం తెలిసిందే.
Casually dropped in Geetha Arts after a long time . I miss the hustle . Wishing for these tough times to end soon . #besafe pic.twitter.com/fUu20dABr5
— Allu Arjun (@alluarjun) August 20, 2020