HomeTelugu Trendingబోయపాటి ని పరామర్శించిన అల్లు అర్జున్‌

బోయపాటి ని పరామర్శించిన అల్లు అర్జున్‌

11 12
స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనును స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన బన్నీ.. బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు. బోయపాటితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడ్‌ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోవైపు బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu