HomeTelugu Big Storiesబాలీవుడ్ లో బన్నీ సినిమా..?

బాలీవుడ్ లో బన్నీ సినిమా..?

అల్లు అర్జున్ సడెన్ గా ముంబైలోని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తోన్న సినిమా సెట్స్ కు వెళ్ళి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. బన్నీ సడెన్ గా రోహిత్ శెట్టి సినిమా సెట్స్ కు వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య బన్నీ హిందీలో నటించడానికి మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నానని చెప్పాడు. అతడి తెలుగు సినిమాలో హిందీలో డబ్ అయి కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటూ ఉండడంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఉత్తరాది మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడు. రోహిత్ శెట్టి కూడా చాలా కాలంగా సౌత్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.
పలువురు తెలుగు, తమిళ హీరోలను పరిశీలనలోకి తీసుకున్నాడు. దక్షిణాది హీరోతో సినిమా చేస్తే అటు ఉత్తరాదిలో తన పాపులారిటీ, సౌత్ లో హీరో మార్కెట్ కలిసి వస్తుందని భావిస్తున్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలే చేసినట్లు వార్తలు వచ్చాయి. అలానే బన్నీ కూడా బైలింగ్యుయల్ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శెట్టి.. అల్లు అర్జున్ కు మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు బన్నీ.. రోహిత్ శెట్టిని కలవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ గనుక సెట్ అయితే.. బాలీవుడ్ లో అల్లు అర్జున్ మాస్ కమర్షియల్ స్టైల్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu