HomeTelugu Big Storiesమహేష్ వద్దంటున్నా బన్నీ వినడంలేదు!

మహేష్ వద్దంటున్నా బన్నీ వినడంలేదు!

మార్కెట్ ని విస్తరించుకోవడం అనేది మన టాలీవుడ్ లాంటి ఇండస్ట్రీ లకు చాలా అవసరం.కానీ దాంట్లో స్ట్రాటజీ కరెక్ట్ గా లేకపోతే రిసల్ట్ తేడాగా వస్తుందని స్పైడర్ ప్రూవ్ చేసింది. నిజానికి స్పైడర్ చాలా మంచి కథ. కానీ దాన్ని ఒకేసారి రెండు భాషల్లో చెయ్యాలనుకోవడంతో టోటల్ గా ప్రాబ్లెమ్ అయిపొయింది.తమిళ్ నేటివిటీ కోసం కొన్ని సీన్స్ ని ,తెలుగు ఫ్లేవర్ అని కెన్నీ సీన్స్ రాసుకుని తియ్యడంవల్ల బ్లెండ్ అవ్వలేదు. పైగా తమిళ్ లో ఒక సినిమా రిలీజ్ అయింది. దాని క్లయిమాక్స్ స్పైడర్ ని పోలి ఉందని మళ్ళీ మార్చారు. అలా అన్ని మార్పులు చేర్పులతో అసలు బొమ్మ కాస్త ఇలా తయారయింది.అదే దీన్ని ఓన్లీ తెలుగులో తీసుంటే ఈపాటికి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కూడా జరుపుకునేది ఈ ప్రాజెక్ట్.
అయితే ఇది చూసి కూడా బన్నీ మారట్లేదు.ఇప్పడు చేస్తున్న సినిమాతరువాత లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అది కూడా తెలుగు,తమిళ్ లో. కానీ దీన్ని తక్కువ బడ్జెట్ తో కంట్రోలింగ్ గా తియ్యమని మాత్రం ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఒక్కసారి స్టార్ట్ అయ్యాక కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అందుకే ముందే ఆలోచించుకుని దిగితే తప్ప లేదంటే లాభం కన్నా ఎక్కువగా నష్టమే వస్తుంది. పైగా ఈ మధ్య తెలుగులో హిట్ అయ్యి అక్కడ డబ్బింగ్ బొమ్మగా విడుదలయిన సినిమాల్లో ఒక్క బాహుబలి తప్ప వేరే ఏది కూడా సరియైన రిసల్ట్ అందుకోలేదు. ప్రస్తుతం మన సినిమాలకు సింహాసనం వేసి కూర్చోబెడుతుంది బాలీవుడ్. సో,మన హీరోలు ఆ దిశగా దృష్టిపెట్టడం మంచిది.
 
 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu