టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా “అల వైకుంఠపురంలో” సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. 200కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ 21వ చిత్రం కూడా కన్ఫర్మ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ 21 తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. తెలుగులో మురుగదాస్ మహేష్ బాబుతో ‘స్పైడర్ ‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీతో మురగదాస్ సినిమా చేస్తున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. రజినీకాంత్ తో ‘దర్భార్’ సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు మురుగదాస్ , మరి బన్నీ, మురుగదాస్ కాంబినేషన్ గురించి వస్తున్న వార్తల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.