ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. పుష్ప టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీంతో ఆదివారం పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతకు స్పెషల్‌గా థ్యాంక్య్ కూడా చెప్పాడు. ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. ‘సమంత గారికి థ్యాంక్స్ చెప్పాలి. స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు హీరోయిన్‌లుకు కొన్ని పరిమితులు ఉంటాయి. అయినా మా సినిమాలో చేయమని అడగ్గానే ఒప్పుకున్నారు. తను నమ్మినా నమ్మకపోయినా మేము ఏది అడిగితే అది వచ్చి చేసింది. సైలెంట్‌గా వెళ్లిపోయింది. తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సందర్భంగా సమంతకు సభాముఖంగా సమంతకు ధన్యవాదాలు చెబుతున్నాను’ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.