HomeTelugu TrendingAllu Arjun మళ్ళీ పుష్ప 2 సినిమా షూటింగ్ నుండీ బ్రేక్ తీసుకున్నారా?

Allu Arjun మళ్ళీ పుష్ప 2 సినిమా షూటింగ్ నుండీ బ్రేక్ తీసుకున్నారా?

Allu Arjun takes another break from Pushpa 2?
Allu Arjun takes another break from Pushpa 2?

Allu Arjun Pushpa 2 shooting:

సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్ Allu Arjun మళ్ళీ తన కుటుంబంతో కలిసి ఓ చిన్న విహారయాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బన్నీ.. తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ లతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని బాగానే ఆకర్షించాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, అల్లుఅర్జున్ తన అయాన్ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ ఉండగా.. తన భార్య స్నేహా తమ కూతురు అర్హ చేతిని పట్టుకొని నడుస్తోంది. సెక్యూరిటీ తో బన్నీ కుటుంబం విమానాశ్రయంలోకి ప్రవేశించింది. అల్లుఅర్జున్ సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుతారు కాబట్టి.. ఇలా అప్పుడప్పుడు కనిపించే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

అల్లుఅర్జున్ పుష్ప 2 షూటింగ్ నుంచి విరామం తీసుకుని కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లినట్టు సమాచారం. ఈ మధ్యనే బన్నీ యూరోప్‌ ట్రిప్ కి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2: ది రూల్ చిత్ర బృందం మాత్రం త్వరగా అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే పనిలో ఉంది.

అల్లుఅర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం భారీ స్థాయిలో హిట్ అయింది. అల్లుఅర్జున్ తన అద్భుతమైన నటనను గానూ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. పుష్ప 2 కూడా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. అసలైతే ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం, పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Read More: Mega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?

Recent Articles English

Gallery

Recent Articles Telugu