HomeTelugu Trendingస్నేహారెడ్డి నా మొదటి భార్య కాదు..

స్నేహారెడ్డి నా మొదటి భార్య కాదు..

11 10
టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్.. స్టార్ హీరోగా అదరగొడుతున్నాడు. ఈ సినీ ప్రయాణంలోనే తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికి ఇద్దరు పిల్లలు అయాన్,అర్హ కూడా ఉన్నారు. ఐతే.. అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డితో ఇది మొదటి పెళ్లి కాదట. అంతకు ముందే పెళ్లి జరిగిందని అల్లు అర్జున్ ఓ సందర్బంలో చెప్పుకొచ్చాడు. తనకు స్నేహారెడ్డితో పెళ్లి కాకముందే సినిమాలతో తనకు మొదటి పెళ్లి అయిందని అని బాంబ్ పేల్చాడు. అలా సినిమాలే తనకు మొదటి పెళ్లాం అని చెప్పాడు. అందుకే స్నేహా రెడ్డి తనకు రెండో భార్య అవుతుందన్నాడు.

ఇక ఈ దేశముదురు సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించిన ‘అల వైకుంఠపురుములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు అదే ఊపులతో అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు వినబడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ శేషాచలం అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. పూర్తి యాక్షన్ క్రైమ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో చాలా అంచనాలే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu