హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా నితిన్‌ని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా ‘భీష్మ’ చిత్రబృందాన్ని అభినందించారు. సరైన సమయంలో నితిన్ మంచి విజయం అందుకున్నారని బన్నీ పేర్కొన్నారు.
డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్. ‘భీష్మ’ విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో జరిగిన మంచి పని ఇది. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ‘భీష్మ’ చిత్రబృందానికి అభినందనలు. ఓ మంచి ఎమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెరకెక్కించిన వెంకీ కుడుములకు కంగ్రాట్స్. రష్మిక నువ్వు ఆల్ రౌండర్. ‘భీష్మ’ విజయంతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత వంశీకి అభినందనలు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మీకు మరింత గొప్పగా జరిగాయి. మొత్తం చిత్రబృందానికి మరోసారి కంగ్రాట్స్’ అని బన్నీ పేర్కొన్నారు. కాగా నితిన్ త్వరలో తన స్నేహితురాలు షాలినీని వివాహం చేసుకోనున్న తెలిసిందే.
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020