
Allu Arjun remuneration:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) బ్లాక్ బస్టర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టి బన్నీ తదుపరి ప్రాజెక్టుపై ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురములో’ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్ 300 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ మూవీకి ఆయన 150 – 200 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ఇది టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్లకు ఇచ్చే అత్యధిక పారితోషికాల్లో ఒకటి.
ఈ సినిమాని సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. బడ్జెట్ దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే, తెలుగు సినీ పరిశ్రమలోనే మరో భారీ ప్రాజెక్ట్ కానుంది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో పాటు ‘పుష్ప 3’ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మరింత భారీ స్థాయిలో ఉండబోతోందని టాక్. అంటే అల్లు అర్జున్ కెరీర్‌లోనే వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలు ఉండబోతున్నాయి.
బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందో, పుష్ప 3 ఎప్పుడు వస్తుందో చూడాలి.
ALSO READ: SSMB29 సెట్స్ లో రెండు కోట్లు ఖర్చు తగ్గించిన రాజమౌళి.. ఎలా అంటే!